
విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలి
జనగామ: విద్యార్థులకు బాల్య దశలోనే సత్యం, ధర్మం, సన్మార్గంలో నడిచేలా తల్లిదండ్రులు మార్గ నిర్దేశం చేయాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యాన నిర్వహిస్తు న్న హిందూ బాల సంస్కార శిక్షణ శుక్రవారం ముగి సింది. డీసీపీ మాట్లాడుతూ శిక్షణలో ధర్మం గురించి తెలుసుకున్న విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు చేరుకు ని సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా రు. పౌరులుగా తమ బాధ్యతలను గుర్తెరిగి ముందుకు నడవాలని సూచించారు. వీహెచ్‌పీ వరంగల్ విభాగ్ కార్యదర్శి నందాల చందర్‌బాబు మాట్లాడు తూ ప్రస్తుత సమాజంలో మంచి మాటలు వినే పరిస్థితి పిల్లల్లో లేదని, ఈ తరుణంలో 125 మంది పిల్లలు నిత్యం వైదిక సూత్రాలను వినేందుకు రావ డం శుభ పరిణామమన్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్లోక పఠనం, గీతాలాపన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు భగవద్గీత, హనుమాన్ చాలీసా, పెన్నులు, పెన్సిల్ బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో లావణ్య, అంబటి బాలరాజు, మైలారం శ్రీనివాస్, చిలువేరు హర్షవర్ధన్, ఉల్లెంగు ల రాజు, ఝాన్సీ, అంబటి బాలరాజు, పాశం శ్రీశైలం, యెలసాని కృష్ణమూర్తి, కుందారపు బైరునాథ్, కూచిపూడి కిరణ్ ఆచార్య, నాగరాజురెడ్డి, ఉమాక ర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, అకివేలు, జ్యోతి, వరలక్ష్మీ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్