
నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి పెట్టాలి
జనగామ రూరల్: విద్యార్థులు నైపుణ్యం ఉన్న రంగంపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం సూర్యాపేట రోడ్డులోని స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అహల్యబాయి హోల్కర్ వందల ఏళ్ల క్రితమే మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని వ్యవసాయం నేర్పించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని దాన్ని వెలికితీసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ భిక్షపతి, శివరాజ్ యాదవ్, తోకల ఉమారాణి, మాలతి రెడ్డి, బొమ్మకంటి అనిల్, పెద్దో జు జగదీష్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు.