
ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. శుక్రవారం కొడవటూర్ వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులతోపాటు ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నా రు. మిల్లర్ల నుంచి ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియ జేయాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహిచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, ఐకేపీ సీసీ సత్యనారాయణ, ఏఈఓ రాజు పాల్గొన్నారు.