
సాధారణ ప్రసవాలు పెంచాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌గౌడ్
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అధికార విభాగం సిబ్బంది.. మహిళలు, పిల్లల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.