వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు

Apr 11 2025 1:00 AM | Updated on Apr 11 2025 1:00 AM

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు

జనగామ: జిల్లా హెడ్‌ పోస్టాఫీసు ఏరియా సంతోషిమాత, ఆంజనేయస్వామి ఆలయ మహారా జ గోపుర, ధ్వజస్తంభ, పరివార సమేత, విగ్రహ స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమాయ్యాయి. ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వేద పురాణం మహేశ్వరశర్మ పర్యవేక్షణలో ఈ నెల10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పూజా కార్యక్రమాలను మొదలు పెట్టారు. మొదటి రోజు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విగ్రహాలకు పూజలు చేశారు. 11వ తేదీన గోపూజ, గురువందనం, పుణ్యాహవచనం, అరణి మధనం, యా గశాల ప్రవేశం, గణేష హోమం, స్థాపిత దేవతా పూజలు, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 12న స్థాపిత దే వతాపూజలు, విగ్రహాలకు స్నపనం, ధాన్యాధి వాసం, ప్రదోషకాల పూజలు, రాజోపచారాలు, 13న హవనములు, శయాధివాస, ఫలనుష్పాధివాస, హిరణ్యాధివాసములు, 14న ప్రతిష్ఠాంగ హోమాలు, గర్త న్యాసం, పిండికాస్థాపన, మూర్తి స్థాపన, స్వాతి నక్షత్ర మిథున లగ్న ముహూర్తంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, బలిహరణం, మహాపూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement