త్యాగాల స్ఫూర్తి.. పోరాటాల ఘనకీర్తి | - | Sakshi
Sakshi News home page

త్యాగాల స్ఫూర్తి.. పోరాటాల ఘనకీర్తి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

● ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన ● ప్రగతి పథంలో జగిత్యాల ● ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి అజారుద్దీన్‌

జగిత్యాల: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది.. ప్రజాస్వామ్య భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు సెప్టెంబర్‌ 17 అని మైనార్టీ వెల్ఫేర్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రి అజారుద్దీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేరవేయడమే అందరి బాధ్యత అన్నారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమం, మహిళ సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధిలో భాగంగా ధర్మపురిలోని ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. 3,53,682 మందికి స్మార్ట్‌ రేషన్‌కార్డులు అందించామని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు 2,14,076 మందికి ప్రతినెలా సుమారు రూ.46.26 కోట్ల పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. కొత్త పింఛన్ల 15,432 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.285.68 కోట్ల వడ్డీలేని రుణాలు అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా రూ.27.30 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలోని 380 గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో 52 లక్షల మొక్కలు పెంచుతున్నామని, ఇప్పటివరకు 8.66 లక్షల మొక్కలు నాటించామని వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం కింద ఇప్పటివరకు 77.72 కోట్ల మంది మహిళలు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. 14,10,844 గ్యాస్‌ సిలిండర్లను రూ.500కే సరఫరా చేశామన్నారు. 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 18,310 వీధివ్యాపారులను గుర్తించి 13,202 మందికి బ్యాంకుల ద్వారా రూ.36 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 1,065 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 1186 మంది గర్భిణులు, బాలింతలు, 29,587 చిన్నారులు, 13,123 మంది పిల్లలకు పోషకాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 2,522 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని, లబ్ధిదారులకు రూ.246.93కోట్లు చెల్లించామని తెలిపారు. వివిధ కారణాలతో మరణించిన 5707 మంది కుటుంబాలకు రూ.285 కోట్లు చేయూత అందించామన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరు చేసి రూ.200 కోట్లు మంజూరు చేశామన్నారు.

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట..

మైనార్టీ సంక్షేమం ద్వారా మైనార్టీ మహిళలకు 598 కుట్టుమిషన్లు అందించామన్నారు. 150 మంది యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, 15 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షలు, ఇందిరమ్మ మైనార్టీ యోజన కింద 76 మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 102 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు, 6 బస్తీ దవాఖానాలు, 17 పీహెచ్‌సీలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు, మాత శిశు కేంద్రం, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ఎస్‌ఎఫ్‌సీ నిధుల నుంచి పారిశుధ్య కార్మికులు, 385 గ్రామాల సర్పంచులకు ప్రతినెలా ఒకటిన గౌరవ వేతనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 1,08,566 మంది నిర్మాణ కార్మికులు నమోదు చేసుకోగా.. వివిధ పథకాల ద్వారా 16,659 కార్మికులకు రూ.62.04 కోట్ల ప్రయోజనం కల్పించామన్నారు. నక్ష లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వందశాతం సబ్సిడీపై 763 చెరువుల్లో 1.69 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

మున్సిపాలిటిలో అభివృద్ధి పనులు

మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జ రుగుతున్నాయని మంత్రి వివరించారు. ఆర్థిక సంఘం నుంచి రూ.13.20 కోట్లు మంజూరు కాగా.. పారిశుధ్య వాహనాల కొనుగోలు, ఎస్‌డబ్ల్యూఎం నీ టి సరఫరా పనులు చేపట్టామన్నారు. అమృత్‌ 2.0 కింద రూ.38.48 కోట్లు మంజూరు కాగా.. పనులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, అ డిషనల్‌ కలెక్టర్లు రాజాగౌడ్‌, లత, ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఏవో కి షన్‌, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, నాయకులు బండ శంకర్‌, సతీశ్‌, ప్రశాంత్‌, బాలముకుందం, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. ముందుగా మంత్రికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement