జగిత్యాల: రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్వర్ణకార సంఘం వార్షికోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సంఘం కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. 75 సార్లు రక్తదానం చేసిన రవి అనే వ్యక్తిని సత్కరించారు.
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలి
రాయికల్: ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, జీవో నంబరు 25ను సవరించాలని, పాతపెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, నాయకులు ఆంజనేయులు, పుర్రె శ్రీనివాస్, రాజిరెడ్డి, రవీందర్, గంగరాజం పాల్గొన్నారు.


