జగిత్యాల: జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైద్యం, విద్య అన్ని రంగాల్లో అందరి సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి పాల్గొన్నారు.
జాతి సమైక్యతతో ముందుకు సాగాలి
జగిత్యాలక్రైం: జాతి సమైక్యతతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, ఏవో శ్రీనివాస్, సీఐలు ఆరీఫ్‌అలీఖాన్, సుధాకర్, కరుణాకర్, రాజ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఆర్‌ఐలు వేణు, ఎస్సైలు పాల్గొన్నారు.
రైస్ మిల్లులో సివిల్ సప్లై తనిఖీలు
కోరుట్ల: కోరుట్లలోని యెఖీన్‌పూర్ పరిధిలోగల శ్రీసాయి రైస్‌మిల్లును సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేసినట్లు సమాచారం. తనిఖీల్లో సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల ధాన్యం స్టాక్‌లో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెల్సింది. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా స్పందించలేదు.


