కోరుట్ల: పోటీ ప్రపంచంలో విద్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకత అవసరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్‌పల్లి డిగ్రీ కళాశాలల విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. టీ హబ్‌లో స్టార్టప్ సంస్థలకు అందిస్తున్న మెంటరింగ్, మార్గదర్శకత్వం, వ్యాపార అభివృద్ధి వంటి అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు. టీ వర్క్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ఫొటో టైపింగ్, డిజైన్, ఉత్పత్తుల తయారీ ప్రక్రియ పరి శీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువు తర్వాత ఉద్యోగం సాధించడంతోపాటు ఆలోచనలు ఆవిష్కరణగా మార్చుకోవాలని ఆకాంక్షించారు.
సేవా సంకల్ప అభియాన్ విజయవంతం చేయాలి
మెట్‌పల్లి: ప్రధాని మోదీ సుపరిపాలనను పురస్కరించుకుని అక్టోబర్ 17వరకు నిర్వహించే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీకోదండ రామాలయంలో గురువారం సేవా సంకల్ప ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతకుముందు ఉదయం పాత బస్టాండ్ వద్ద తెలంగాణ విమోచన వేడుక నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దొనికెల నవీన్, నాయకులు పాల్గొన్నారు.


