గురుకులంలో గదుల కొరత ఉండడంతో నేలపైనే చదువుకుంటున్నాం. బెంచీలు 7, 9వ తరగతుల్లోనే ఉన్నాయి. విద్యార్థులు ఉదయం బెంచీలు వేయడం.. సాయంత్రం పడుకునే సమయంలో బెంచీలు తీస్తున్నాం. పాములు, తేళ్లతో భయపడుతున్నాం.
– మనోహర్, 9వ తరగతి
పాఠశాల ప్రారంభం నుంచే సమస్యలు
గురుకులం పాఠశాల ఏర్పడినప్పటి నుంచి తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రధాన సమస్య. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తరగతి గదుల కొరత మినహాయించి భోజనం, చదువు విషయంలో మాత్రం సమస్య లేదు. – స్వప్న, ప్రిన్సిపాల్
చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు


