ప్రమాదరహిత ఘాట్‌రోడ్డుకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదరహిత ఘాట్‌రోడ్డుకు ప్రతిపాదనలు

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

మల్యాల:కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో మరో ఘాట్‌ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. వైజంక్షన్‌ వద్ద, గతంలో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుత ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా ఉందని, మరో రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలో టీటీడీ నిధులతో భవనాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హరిచందర్‌, డీఈఈ సత్యనారాయణ, సర్పంచ్‌ దారం ఆదిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

కొండగట్టు ఘాట్‌రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే సత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement