మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న | - | Sakshi
Sakshi News home page

మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్న

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

మాది రాయికల్‌ పట్టణంలోని పోచమ్మవాడ. మూడు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో రాయికల్‌ ఆస్పత్రికి వచ్చాను. ఇక్కడ వైద్య సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ వైరల్‌ జ్వరాలతో ఆస్పత్రి అంతా నిండిపోయింది.

– శాంత, రాయికల్‌

ఆస్పత్రిలో మెరుగైన సేవలు

రాయికల్‌ ఆస్పత్రికి వైరల్‌ ఫీవర్స్‌తో చాలా మంది రోగులు అడ్మిట్‌ అవుతున్నారు. 24 గంటల పాటు, నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నాం. మందుల కొరత వంటి సమస్య ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యసేవలు పొందాలి.

– శశికాంత్‌రెడ్డి, సూపరింటెండెంట్‌

ఫాగింగ్‌ చేయిస్తున్నాం

రాయికల్‌ మున్సిపాలిటీలో దోమల నివారణకు ప్రతి వార్డులో ఫాగింగ్‌ చేయిస్తున్నాం. పారిశుధ్య కార్మికులతో మురికికాలువల్లో చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నాం. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

– మనోహర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement