కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 70వ జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బన్సిలాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే కరీంనగర్ జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఎల్జిబిలిటీ ఫాంతో రిపోర్ట్ చేయాలని సూచించారు. 16న అండర్– 17 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్,– 17న అండర్– 14 బాలికలకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 18న అండర్– 17 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, 19న అండర్ 14 బాలురకు కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తారు.


