ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం తరఫున ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలు అందించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, సూపరింటెండెంట్ అలువాలు శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
విద్యార్థులు కంటి పరీక్షలు చేయించుకోవాలి
జగిత్యాల:విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అంధత్వ నివారణ అధికారి రాజేందర్‌రెడ్డి అన్నారు. జాతీయ అంధత్వ నివారణ రాష్ట్రీయ బాల స్వస్థ్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా రెండు టీంలను ఏర్పాటు చేశామని, 6 నుంచి 10 చదువుతున్న విద్యార్థులు 41,930 మందికి పరీక్షలు చేస్తామన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
● డీఏవో భాస్కర్
కథలాపూర్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు అవగాహన కల్పించా రు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులను తింటే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో ఏవోలు యోగితా, శ్రీనివాస్, ఏఈవోలు హరీశ్, రాఘవేంద్ర, సుష్మాశ్రీ, సంధ్యరాణి, మౌనిక, రైతులు పాల్గొన్నారు.


