ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద చాయ్ హోటల్‌లో కల్వకుంట్ల సంజయ్ కార్యకర్తలతో కలిసి చాయ్ తాగుతూ సరదా గా ముచ్చట పెట్టారు. రాజకీయ పరిణామాలు, వి ద్యుత్ సరఫరా, యాప్ ద్వారా ఎరువులపై ప్రజలు ఏమంటున్నారని కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నా రు. విద్యుత్ కోతలు విధిస్తున్నారని, పంటలకు సాగునీరు అందడం లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా అయ్యింద ని, ప్రజలు ఆయననే గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. యాప్‌తో రైతులకు యూరియా దొరకడం లేదని, ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్‌కు ఓటేస్తే చెప్పుతో కొట్టుకోవాలని అంటున్నారని వివరించారు.


