నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● ఎస్పీ అశోక్‌కుమార్‌

జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం సారంగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. స్టేషన్‌ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదులలో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, ప్రజలకు భద్రతాభావం కల్పించడంలో విజిబుల్‌ పోలీసింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్టేషన్‌ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఎస్సై గీత, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement