జగిత్యాలటౌన్: స్వరాష్ట్ర సాధనకు తొలిదశ నుంచి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ వరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మార్గదర్శిగా నిలిచారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని జయశంకర్ కూడలిలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం.. స్వరాష్ట్రంలో జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలన సాగిందన్నారు. ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని న్యాయవాది కూర్మాచలం ఉమామహేష్ అన్నారు. డిగ్రీ కళాశాల సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏనుగుల రాజేందర్, వీరబత్తిని అనిల్, నల్ల శ్యాం, మూలాసపు రాజన్న పాల్గొన్నారు.
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
జగిత్యాలజోన్: యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి ఆదివారం యోగా చేశారు. ధ్యానంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని, నిద్రలేమి సమస్య ఉండదని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక ధృడత్వం పెరుగుతుందన్నారు. యోగా శిక్షకుడు చింతకింది కిశోర్‌ను జడ్జిలు సన్మానించారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండవ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిని కలిసిన జిల్లా జడ్జిలు
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ ఆదివారం జగిత్యాలకు వచ్చారు. జిల్లా న్యాయమూర్తులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి, సబ్ జడ్జి నాగేశ్వర్‌రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా ఉన్నారు.
అభివృద్ధితోనే సమాధానం
రాయికల్: తాను అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నానని, ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో తనతోపాటు పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, నాయకులు మోర హన్మాండ్లు, గండ్ర రమాదేవి, మహేందర్ గౌడ్, బాబా, మచ్చ శేఖర్ పాల్గొన్నారు.


