విద్యానగర్(కరీంనగర్): ఆదివారం జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి, తమ ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఏసీ బస్సులు మినహా మిగితా అన్ని బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
మొహర్రం సందడి
జగిత్యాల:మొహర్రం సందర్భంగా జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది. పోచమ్మవాడలో పెద్ద పులుల వేషధారణతో ఆటలు ఆడారు. బైక్‌లపై ఎక్కి సరాదాగా షికారు చేశారు.


