జగిత్యాలక్రైం: నేరాల నియంత్రణ, ప్రజాభద్రతపై దృష్టి సారించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరిగా అమలు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జగిత్యాల టౌన్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను శనివారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, విచారణ విధానం, నేరాల నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, ట్రాఫిక్ చలానాలు, రోడ్డు భద్రత అమలు పరిశీలించారు. వాహన రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్, ఎస్సైలు సదాకర్, కుమారస్వామి, సుప్రియ ఉన్నారు.


