జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు విషయంలో రాజకీయాలు చేయొద్దని, అనుకూలమైన స్థలం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే అభివృద్ధినే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ కృషితో కేంద్రీయవిద్యాలయం మంజూరు చేస్తే స్థలం ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. చల్‌గల్‌లోని వాలంతరీ స్థలాన్ని గుర్తించినా రెండెకరాలు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వడ్డెపల్లి శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, కార్యాలయం కార్యదర్శి జుంబర్తి దివాకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓరుగంటి చంద్రశేఖర్, మహిళామోర్చా నాయకురాలు భానుప్రియ, జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాదరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


