సరస్వతీ పుష్కరాలకు రండి | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ పుష్కరాలకు రండి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

ధర్మపురి: జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని త్రివేణి సంగమం శ్రీకాలహస్తీశ్వర–ముక్తీశ్వర స్వామి ఆల యం వద్ద ఈనెల 21 నుంచి జూన్‌ ఒకటి వరకు నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాలకు రావాలని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ను ఆహ్వానించారు. దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావు ఆహ్వాన పత్రిక అందించారు. ముందుగా స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.

ధాన్యం దిగుమతి చేసుకోవాలి

మల్లాపూర్‌ : మిల్లులకు చేరుతున్న ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌.లత అన్నారు. మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, చిట్టాపూర్‌ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను, రైస్‌మిల్లులను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు లారీల్లో ధాన్యం తరలించాలన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, తహసీల్దార్‌ రాంచందర్‌, ఆర్‌ఐలు రాజేశ్‌, అశోక్‌, ప్యాక్స్‌ సీఈవోలు పాల్గొన్నారు.

మక్క రైతుల ఆందోళన

మెట్‌పల్లి: మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మార్కెట్‌ యార్డుకు పంటను తీసుకొచ్చి నెల రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదన్నారు. గన్నీ సంచుల కొరత ఉందంటూ తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు పురుగుల మందు డబ్బాలతో వచ్చారు. ట్రాఫి క్‌ భారీగా స్తంభించడంతో పోలీసులు వచ్చి రైతులను సముదాయించారు. ఆందోళన విరమింపజేశారు.

కారు ఢీకొని చిన్నారికి గాయాలు

మెట్‌పల్లి: పట్టణంలోని ఆరపేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొసగంటి సహస్ర అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. సహస్ర రోడ్డు పక్కన నిలబడి ఉండగా.. అదే సమయంలో కోరుట్ల వైపు వెళ్తున్న ఓ కారు ఆదుపు తప్పి చిన్నారిని ఢీ కొట్టి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చిన్నారి తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో సమయంలో గుడిసెలో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement