మహిళాసాధికారతకు ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళాసాధికారతకు ప్రభుత్వం కృషి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌: మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. బీర్‌పూర్‌ మండలం కొల్వాయిలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘాల భవనాలకు మంగళవారం భూమిపూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.10 లక్షలతో నిర్మించే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికా భివృద్ధి చెందేలా స్వయం ఉపాధి యూనిట్లకు సీ్త్రనిధి రుణాలు, బ్యాంక్‌ లింకేజీ అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 33 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, 16 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ రంగు లక్ష్మణ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ నవీన్‌రావు, ఎంపీడీవో భీమేశ్‌, తహసీల్దార్‌ సుజాత, కేడీసీసీ మాజీ సభ్యుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. ముందుగా సారంగాపూర్‌ రైతు వేదికలో మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, 46 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులు అందించారు.

ముఖ్యమంత్రిని బిచ్చగాడు అంటారా..?

జగిత్యాల: ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ అర్వింద్‌ ప్రయత్నిస్తున్నారని, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో తనతోపాటు, ఎంపీకీ బాధ్యత ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రధానిని నిధులు కోరితే బిచ్చగాడు అంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో కేంద్రానికి రూ.రెండు లక్షల కోట్లు ఇస్తే కేంద్రం రూ.85వేల కోట్లే ఇచ్చిందన్నారు. రోడ్లు, బ్లాక్‌స్పాట్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం ఎంపీ, కేంద్రమంత్రులను తాను కలిశానని, ఒక్కటీ మంజూరు చేయలేదన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, చైర్‌పర్సన్‌ వాణి, నాయకులు నాగభూషణం, శంకర్‌, దామోదర్‌రావు, కొత్తమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement