● ఇప్పటికీ వ్యవసాయ బావులే దిక్కు ● ఆందోళనలో అన్నదాతలు ● తాగునీటికి గ్రామస్తుల తిప్పలు ● పట్టించుకునే వారు కరువు | - | Sakshi
Sakshi News home page

● ఇప్పటికీ వ్యవసాయ బావులే దిక్కు ● ఆందోళనలో అన్నదాతలు ● తాగునీటికి గ్రామస్తుల తిప్పలు ● పట్టించుకునే వారు కరువు

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● ఇప్పటికీ వ్యవసాయ బావులే దిక్కు ● ఆందోళనలో అన్నదాతలు ● తాగునీటికి గ్రామస్తుల తిప్పలు ● పట్టించుకునే వారు కరువు

ఎస్సారెస్పీ నీరొచ్చే మార్గం ఇదే..

మండలంలో 32గ్రామాలున్నాయి. 31 గ్రామాలకు ఎస్సారెస్పీ నీరు అందుతుండడంతో తామేం పాపం చేశామని మాకు నీరు ఇవ్వడం లేదని రాజనగర్‌ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ బావుల ద్వారానే ఇక్కడి రైతాంగం వరి, మామిడి, పసుపు వంటి పంటలు పండిస్తున్నారు. ఎండాకాలం కావడంతో భూగర్భజలాలు అడుగంటి పంటల సాగుపై అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 1200మంది జనాభా, 700మంది ఓటర్లు, 280 రైతు కుటుంబాలు ఉన్నాయి. సుమారు 650 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 200 బావుల ద్వారా వరి, మామిడి, పసుపు పంట పండిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వ్యవసాయ బావులు, చేద బావుల అడుగంటి ఆందోళనకు గురవుతున్నారు. గ్రామానికి త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా కూడా తగ్గించడంతో పంటలకు నీరందించడం కష్టంగా మారిందంటున్నారు రైతులు. ఎస్సారెస్పీ నీటిని గ్రామానికి మళ్లించాలని రైతులు కోరుతున్నా.. పట్టించుకున్నవారు లేరంటున్నారు స్థానికులు. విషయాన్ని ప్రభుత్వదృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదంటున్నారు.

గ్రామంలోకి ఎస్సారెస్పీ నీరు రావాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మండలంలోని శ్రీరాంనగర్‌ గ్రా మం నుంచి ఎస్సారెస్పీ కాలువ తవ్వి నీటిని మళ్లించే అవకాశం ఉంది. అలాగే సారంగపూర్‌ మండలం రంగాపేట నుంచి డీ–53 కాలువ కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ అటవీ ప్రాంతం నుంచి కాలువ తవ్వితే గ్రామంలోకి ఎస్సారెస్పీ నీరు వచ్చే అవకాశం

ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement