మా గ్రామానికి ఏ అధికారి వచ్చినా.. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వచ్చినా మాకు ఎస్సారెస్పీ నీరు తెప్పించాలనే అడుగుతున్నాం. ఏళ్ల తరబడిగా కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయ బావులను ఏటేటా లోతు తవ్వించాల్సి వస్తోంది. కాలువ కోసం ఉద్యమిస్తాం.
– రాజేశ్, సర్పంచ్
గ్రామంలోకి ఎస్సారెస్పీ నీటిని తీసుకొచ్చేందుకు భగీరథ ప్రయత్నమే చేశాం. అయినా ఫలితం లేకుండా పోయింది. గ్రామంలో ఎస్సారెస్పీ నీరు లేకపోవడంతో పంటలు పూర్తిస్థాయిలో సాగుచేయడం లేదు. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు.
– ఆదిరెడ్డి, రైతు
గ్రామంలోకి ఎస్సారెస్పీ
నీరు వస్తే రైతుల కష్టాలు తీరుతాయి. ప్రతి రైతు పంటల సాగు కోసం వ్యవసాయ బావులు తవ్వించాల్సి వస్తోంది. ఒక్కో రైతు సుమారు రెండు మూడు బావులు తవ్విస్తున్నారు. అదే ఎస్సారెస్పీ నీరొస్తే మాకు ఈ దుస్థితి ఉండదు.
– స్వామి, రైతు


