పెగడపల్లి: ధాన్యం కొనుగోలులో జాప్యం, మిల్లర్ల దోపిడీపై మండలంలోని అయితిపల్లిలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం ధర్నా చేశారు. నెలరోజులు కావస్తున్నా కొనుగోలు సజావుగా సాగడం లేదని, ఇబ్బంది పడుతున్నామని రైతులు పేర్కొన్నారు. తాలు, తప్ప, తరుగు పేరిట మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గోలి సంజీవరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పలుమారు విజయ్‌యాదవ్, రహీం, కొండయ్య, చంద్, శ్రీనివాస్, తిరుపతి, రాజాక్, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


