జగిత్యాల: బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని లేకుంటే రక్తహీనతతో బాధపడతారని మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు రక్తపరీక్షల శిబిరం నిర్వహించారు. పోషకాహారం, ఐరన్ లోపంతో విద్యార్థులు నీరసంగా ఉండి చదువుపై ఏకాగ్రత తగ్గుతుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికల్లో రక్తహీనత ముందుగానే గుర్తించి శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు ఆకుకూరలు, బెల్లం, రాగులు, అరటి పండ్లు తీసుకోవాలని, నులిపురుగు మాత్రలు వేసుకోవాలన్నారు.


