సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

● పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త భవ్య

గొల్లపల్లి: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త భవ్య అన్నారు. మండలంలోని ఇబ్రహీంనగర్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తల్ఙు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకంతో నేలసారం దెబ్బతినడమే కాకుండా, మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకుంటూ.. నాణ్యమైన, విషరహిత ఆహార ఉత్పత్తులను పండించేందుకు రైతులు సేంద్రియ సాగు పద్ధతులను అనుసరించాలని సూచించారు. సర్పంచ్‌ శోభన్‌ గౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, టీచింగ్‌ అసోసియేట్‌ అష్ఫాక్‌, ఎంఏవో కరుణ, ఉప సర్పంచ్‌ రాజేందర్‌ రెడ్డి, ఏఈవో ఫిర్దోస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement