తండాల అభివృద్ధికి నిధులు | - | Sakshi
Sakshi News home page

తండాల అభివృద్ధికి నిధులు

May 19 2026 12:34 AM | Updated on May 19 2026 12:34 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పెగడపల్లి: గిరిజన తండాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఏడుమోటలపల్లితండాకు రూ.2 కోట్లు, కీచులాటపల్లి నుంచి మల్లాపూర్‌ వరకు రూ.8 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. పనుల్లో జాప్యానికి కారణాలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణాల్లో భూములు కోల్పోతున్న రైతులను ఒప్పించి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఏఎంసీ చైర్మన్‌ ఆనందం, సర్పంచులు ఆనందం, రమేశ్‌నాయక్‌, రాజేశం, ఈఈ శ్రీనివాస్‌, డీఈలు సంపత్‌కుమార్‌, అశ్విన్‌, తహసీల్దార్‌ సయ్యద్‌ నిజామొద్దీన్‌, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి పాల్గొన్నారు. ముందుగా మంత్రి రాజరాంపల్లి అనుబంధం నక్కపల్లి సంతలో మంత్రి కూరగాయలు కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement