జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, రఘురాములకోట పరిధిలోని ముప్పా ల చెరువుకు వరదనీరు వెళ్లే ఒర్రె, వాగును ఇటీవల కొంతమంది మట్టిపోసి చదును చేసి కబ్జా చేసిన విషయం తెల్సిందే. వాగును పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత గొల్లపల్లి ప్రధాన రహదారిపై సోమవారం దీక్ష చేపట్టారు. రూరల్ తహసీల్దార్ హకీం, ఇరిగేషన్ డీఈ అక్కడకు వెళ్లి వారంలోపు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో జీవన్‌రెడ్డి శాంతించారు. ధరూర్ సర్పంచ్ శీలం సురేందర్, దావ సురేశ్, మునీందర్‌రెడ్డి, ధర్మయ్య, హరీశ్ పాల్గొన్నారు.


