ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని శ్రీకోదండ రామాలయంలో మంగళశారం సాక్షి దినపత్రిక 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ‘సాక్షి’ పాఠకులు, అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ లక్షలాది మంది పాఠకుల ఆదరణ పొంది ఉన్నతస్థాయిలో నిలిచిందన్నారు. అనంతరం స్థానిక రిపోర్టర్ రంగు తిరుపతిని సన్మానించారు. సాక్షి యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచులు మండిగ రాయనర్సయ్య, బాసంపల్లి కొండయ్య, బూర్ల వెంకటసత్యం, మాజీ ఎంపీటీసీ గొల్లే భూమేశ్, ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీశ్‌బాబు, అంబేడ్కర్ సంఘం నాయకుడు కవ్వంపల్లి చంద్రయ్య, వివిధ సంఘాల నాయకులు బుర్ర అజయ్, బుర్ర గణేశ్, మహేందర్, రాకేశ్, రాంరెడ్డితోపాటు ‘సాక్షి’ పాఠకులు, అభిమానులు పాల్గొన్నారు.


