బుగ్గారం: ప్రభుత్వ భవనాల నాణ్యత విషయంలో అధికారులదే బాధ్య త అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆదివా రం శంకుస్థాపన చేశారు. బుగ్గారంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10లక్షలతో వీవో భవనం, వెల్గొండలో రూ.5 లక్షలతో చేపట్టే డ్రైనేజీ నిర్మాణం, రూ.15 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించే పనుల్లో కాంట్రాక్టర్లు రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత పరిశీలించాలని సూచించారు. మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. వెల్గొండలో ఓ వికలాంగుడికి ట్రైసైకిల్ ఇప్పిస్తానన్నారు.
పాఠశాలల్లో ఆధునిక వంట గదులు
పెగడపల్లి: వచ్చే విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వంట గదులు నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో రూ.30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన వంట గదిని ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ ఒరుగల అరుణ, మోడల్ స్కూల్ పిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, డీఈ అశ్విన్, సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


