కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మత్తడి నిర్మాణం పూర్తయ్యిందని, మిగిలిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం గతంలో ప్రతినెల 22న నిరసనలు, ధర్నాలు, పాదయాత్ర చేపట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో 43 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. కాలువ పనుల భూసేకరణ కోసం రూ.45.5 కోట్లు విడుదల చేశామన్నారు. నీటిపారుదలశాఖ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు న్యావనంది శేఖర్, కల్లెడ గంగాధర్, పులి హరిప్రసాద్, చెదలు సత్యనారాయణ, వాకిటి రాజారెడ్డి, ఎండీ.హఫీజ్, రాజు, బోదాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


