మెట్‌పల్లి: మున్నూరు కాపులు రాజకీయంగా రాణించాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నియోజకవర్గ పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో కాపు ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుల అభ్యున్నతికి కాపులంతా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి తదితరులు ఉన్నారు.


