జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసిన కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు జగిత్యాల స్పెషల్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఎస్కార్ట్ మధ్య జగిత్యాల ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. తల, మెడనొప్పితో బాధపడుతున్న హరిబాబుకు వైద్యులు చికిత్స అందించారు. మధ్యాహ్నం తిరిగి సబ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సబ్ జైలర్ మొగిలేష్ తెలిపారు.


