చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని భర్ధీపూర్‌ గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్‌ (25) గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి అందులోనే పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 21న చేపలు పట్టేందుకు వెళ్లిన వెంకటేశ్‌ తిరిగి రాకపోవడంతో గోదావరి ప్రాంతంలో వెదికారు. నీటిలో శవమై కనిపించాడు. వెంకటేశ్‌ తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ ఒకరు..

జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్‌ రోడ్డులోగల వాసవి కల్యాణ మండపం వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని గాయపడిన వొద్ది హరీశ్‌(54) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణంలోని గుట్టరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాంతంలో నివాసముండే హరీశ్‌ శనివారం సాయంత్రం మిత్రులతో కలిసి కరీంనగర్‌ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. పార్కింగ్‌ చేసిన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. పట్టణానికి చెందిన సయ్యద్‌ సాహిల్‌ తన ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా నడుపుతూ హరీశ్‌ను ఢీ కొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అతని మిత్రులు జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. హరీశ్‌ కుమారుడు సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..

మెట్‌పల్లిరూరల్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. మెట్‌పల్లి మండలం వేంపేటకు చెందిన నీరటి రాజేశం(47), మగ్గిడి హరీశ్‌ శనివారం ద్విచక్రవాహనంపై వేంపేట నుంచి మెట్‌పల్లికి పనినిమిత్తం బయల్దేరారు. గెదే అడ్డుగా రావడంతో బైక్‌పై ఉన్న రాజేశం కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజేశంను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement