మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో రైతులకు లాభం జరుగుతుంది. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1800కు మించి కొనడం లేదు. మార్క్‌ఫెడ్ కొంటే క్వింటాల్‌కు రూ.2400 ధర రానుంది. రైతులకు రూ.600 వరకు లాభం జరుగనుంది.
– నల్ల రాజిరెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి(మం)
మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొనుగోలుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొంటాం. ప్రభుత్వం నుంచి ఒక్కటి రెండు రోజుల్లో ఆదేశాలు వచ్చే అవకాశముంది.
– ఎండీ.హబీబ్, మార్క్‌ఫెడ్ అధికారి, జగిత్యాల


