కోరుట్ల: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ జనాలను పిచ్చోళ్లను చేసే బడ్జెటే తప్ప ఎలాంటి కొత్తదనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల ఊసే లేదు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 వరకు పింఛన్ పెంపుపై ఎలాంటి కేటాయింపులు లేవు. రాజీవ్ యువవికాసం కోసం గత బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. మళ్లీ ఈ బడ్జెట్‌లో అదే రూ.6,000 కోట్లు కేటాయింపులు చూపించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎలాంటి కేటాయింపులు లేకపోవడం బాధాకరం. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు చెల్లించే సెటిల్‌మెంట్లపై ఎం కేటాయించలేదు. ఆరు గ్యారంటీలకు చెల్లు చీటి పెట్టారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు.
– కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల


