‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

‘సాక్

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం

మహిళల సామాజిక భద్రతకు పెద్దపీట వేయాలి సరస్వతీ అమ్మవారికి విప్‌ ఆది శ్రీనివాస్‌ పూజలు

కోరుట్ల రూరల్‌: ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయడం అభినందనీయమని వెంకటాపూర్‌ సర్పంచ్‌ ద్యాగ గంగాధర్‌ అన్నారు. వెంకటాపూర్‌, చిన్నమెట్‌పల్లి, పైడిమడుగు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో బుధవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. విద్యార్థులు స్టడీ మెటీరియల్‌ ఉపయోగించుకుని, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచించారు. ఆనంద్‌, అజయ్‌కుమార్‌, గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు హరివరప్రసాద్‌ సూచించారు.

జగిత్యాలరూరల్‌: ప్రస్తుత సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారని, వారికి సామాజిక భద్రత కల్పించాలని స్టేట్‌ సెర్ప్‌ జెండర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జమున సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల సమాఖ్య బాధ్యులు, సోషల్‌ యాక్షన్‌ సభ్యులు, ఏపీఎంలకు జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. మహిళల హక్కులు, రక్షణకు సెర్ప్‌ ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామ సమాఖ్యల ద్వారా జెండర్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి, జెండర్‌ సఖీ కమిటీల ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వరకట్న వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, అత్యాచారాలు, అక్రమ రవాణా వంటి సమస్యలపై ఈ కమిటీలు పోరాటం చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్‌ మాట్లాడుతూ, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 18 మండలాల్లో జెండర్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సెర్ప్‌ ఏపీడీ పి.సునీత, సెర్ప్‌ జెండర్‌ ప్రాజెక్టు అధికారి లింగయ్యగౌడ్‌, జిల్లా జెండర్‌ డీపీఎం రమేశ్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, కార్యదర్శి ఎన్‌.ఆమని, కోశాధికారి సీహెచ్‌.హరిత పాల్గొన్నారు.

మేడిపల్లి: భీమారం మండలం దేశాయిపేట గ్రామంలో బుధవారం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పర్యటించారు. సరస్వతీ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. గ్రామంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబసభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, ఏనుగు రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌లు పుల్లురి ఉమారాణి, దాసరి గణేశ్‌, ఇట్టేడి రాజారెడ్డి, చెక్కపల్లి స్వాతి, బొమ్మెన ప్రశాంత్‌, కానుగంటి శ్రీనివాస్‌, రాజగౌడ్‌ పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ రూపొందించిన డైరీని బుధవారం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్య ఆరోగ్యశాఖలో కమ్యునిటి హెల్త్‌ ఆఫీసర్ల పాత్ర గొప్పదని, అన్నిట్లో మెరుగైన సేవలందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంమోహన్‌, కార్యదర్శి రాజశేఖర్‌, సాగర్‌రావు, సందీప్‌, నాయక్‌, జ్యోతి పాల్గొన్నారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌   ఎంతో ఉపయోగం1
1/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌   ఎంతో ఉపయోగం2
2/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌   ఎంతో ఉపయోగం3
3/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement