విద్యుత్‌ అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అధికారుల విచారణ

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

విద్యుత్‌ అధికారుల విచారణ

విద్యుత్‌ అధికారుల విచారణ

వెల్గటూర్‌: ‘వెలుగులశాఖలో అవినీతి మరకలు’ పేరున ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వెల్గటూర్‌ మండలం జగదేవపేటలో విద్యుత్‌ అన్‌ మ్యాన్‌ లంచాల విషయంలో సమగ్ర విచారణ జరిపారు. సదరు అన్‌ మ్యాన్‌ గ్రామస్తులను ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు వే యిస్తానని నమ్మించి, డబ్బులు తీసుకున్నట్టు ప్రాథమికంగా బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వెంటనే అన్‌ మ్యాన్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించినట్లు ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. అన్‌ మ్యాన్‌ వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకున్న విషయం ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్‌ఈలకు తెలియదని, అధికారులకు తెలియజేసి ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని తెలిపారు. వినియోగదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని, ఏ సమస్య ఉన్నా సంబంధిత సెక్షన్‌ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. లేకుంటే 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యలు తెలియజేయవచ్చు అని ఎస్‌ఈ సుదర్శనం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement