● మాజీమంత్రి జీవన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

● మాజీమంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్‌: వలస కాంగ్రెస్‌ వాదులకు పట్టణ ప్రజల తీర్పు అభినందనీయమని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయికల్‌లో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అధికారం అనుభవించిన తర్వాత వలసవాదులు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి పోటీ చేయడంతో పట్టణ ప్రజలు ఓటుతో వ్యతిరేక తీర్పు ఇచ్చారన్నారు. ఓటరు మహాశయులకు హ్యాట్సాఫ్‌ అంటూ కితాబిచ్చారు. నూతన పాలకమండలి సభ్యులు జోన్ల వ్యవస్థను ఎత్తివేసే వేయాలని, ప్రభుత్వ ఆస్పత్రి పక్కన కోట్లాది రూపాయల భూమి అన్యాకాంతమవుతుందని పరిరక్షించాలన్నారు. అమృత్‌–2 పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుధ్యం, తాగునీటి వ్యవస్థ, సీసీరోడ్డు డ్రెయినేజీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నాయకులు మహిపాల్‌రెడ్డి, బాపురపు నర్సయ్య, తంగెళ్ల రమేశ్‌, నరేశ్‌, మున్ను, శ్రీకాంత్‌, శివ, ఎద్దండి భూంరెడ్డి, బత్తిని భూమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement