ఆహ్లాదం.. అధ్వానం!
ఇది రద్దీగా ఉండే కొత్తబస్టాండ్ చౌరస్తా. పట్టణంలో ఏ సమావేశం అయినా ఇక్కడే జరుగుతాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంతో పాటు, భారతదేశ చిత్రపటం, చుట్టూ లాన్, ఫెన్సింగ్, ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ గాలికొదిలేయడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారులు పట్టించుకోవాల్సిన అవసరముందని ప్రజలు అంటున్నారు.
ఇది పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా. ఇక్కడ జంక్షన్ నిర్మించారు. అందమైన బొమ్మలు, లాన్ ఏర్పాటు చేసి నిత్యం ఫౌంటేన్ ద్వారా నీరు పోస్తూ ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాటు చేశారు. అవి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. నిర్వహణను అధికారులు, ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారు. లాన్ ఎండిపోగా, బొమ్మలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఆహ్లాదం.. అధ్వానం!


