పశువైద్య శిబిరాలతో రైతులకు మేలు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): పశువైద్య శిబిరాలు పాడిరైతులకు ఎంతో ఉపయోగపడుతాయని పశు వైద్య, సంవర్ధకశాఖ జిల్లా అధికారి ప్రకాశ్ అన్నా రు. శుక్రవారం మెట్‌పల్లి మండలం వేంపేటలో పశువైద్య సంవర్ధకశాఖ, కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరంతో పాటు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవులు, గేదెలు, దూడలకు టీకాలు వేశారు. అనారోగ్యంతో ఉన్న పశువులను పరిశీలించి నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఐక్యత దినో త్సవంలో భాగంగా వెటర్నరీ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు ర్యాలీగా వెళ్లారు. కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, మెట్‌పల్లి మండల పశువైద్యాధికారి మనీషాపటేల్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గోపాలకృష్ణ, విశాల్, సురేశ్, మల్లేశ్, రవికాంత్, నాయకులు అల్లూరి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


