
కాంగ్రెస్ పాలనపై లండన్‌లో ఎన్నారైల నిరసన
రాయికల్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 22 నెలలు గడుస్తున్నప్పటికీ హామీలు అమలు చేయడం లేదంటూ ఆదివారం లండన్‌లోని ఎన్నారై బీఆర్‌ఎస్‌ఎల్ యూకే ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు. మన కాళేశ్వరం, మన హైదరాబాద్, మన రైతులను కాపాడుకోవాలని కోరుతూ ప్రదర్శన చేశారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎఫ్‌టీసీ మాజీ చైర్మన్ కుర్మాచలం అనిల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే.. కాంగ్రెస్ హయాంలో అభివృద్ది లేకుండా పోయిందన్నారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షులు నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నవపేట్ హరీ, సత్యమూర్తి, చినుముల రవి, కుమార్, అడ్వైజరీ బోర్డు వైస్‌చైర్మన్ గణేశ్, మల్లారెడ్డి, సురేష్, జాఫర్, ఐటీ మీడీయా పీఆర్ రవి ప్రదీప్, సంయుక్త కార్యదర్శులు నవీన్, ప్రశాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.