
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
జగిత్యాలటౌన్: కోటి వెలుగుల క్రాంతి. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి.
కష్టాలు అనే చీకట్లను తొలగించే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయంతో సంబరాలు జరుపుకొనే వెలుగుల తారాజువ్వల మాలిక. నేటి దీపావళి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు సిద్ధం అయ్యారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక పూజలు, నివాసాలు, ఆలయాల్లో నోములు, వ్రతాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా మార్కెట్లు కిక్కిరిశాయి. బంతిపూలు, గుమ్మడికాయలు, ఇతర పూజాసామగ్రి అమ్మకాలతో రద్దీగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద సందడి నెలకొంది. కిలో చొప్పున విక్రయిస్తుండగా.. ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెబుతున్నారు. జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్డు, అంగడిబజార్, మార్కెట్ ప్రాంతాలన్నీ రకరకాల, రంగురంగుల దివ్వెల విక్రయాలతో బిజీగా మారిపోయాయి.
– వివరాలు 8లో

వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి

వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి

వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి

వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి