
ధర్మపురిలో లక్ష్మీపూజలు
అద్దాల మండపంలో పూజలు
ధర్మపురి: దీపావళి సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం మొదటి రోజు అద్దాల మండపంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్ఛరణలతో లక్ష్మీపూజలు చేశారు. సోమవారం సాయంత్రం స్వామివార్ల ఊరేగింపు సేవ, మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకరణ చేస్తారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, అర్చకులు తదితరులున్నారు.
దీపావళికి కొత్త కాంతులు తేవాలి
జగిత్యాలటౌన్: దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని సూచించారు.
ఆలయాల్లో భక్తుల రద్దీ
ధర్మపురిలోని ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించారు.
ఆలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
మల్యాల: ఆలయ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీ కోసం కృషి చేయాలని కొండగట్టు దేవస్థానం ఆలయ ఉద్యోగులు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ను కోరారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయనను కొండగట్టు ఆలయ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి అంజన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్ది, రాష్ట్ర టీఎన్జీవో ఉపాధ్యక్షుడు రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ధర్మపురిలో లక్ష్మీపూజలు

ధర్మపురిలో లక్ష్మీపూజలు

ధర్మపురిలో లక్ష్మీపూజలు