జగిత్యాలటౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని, రైతులకు అండగా నిలవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వరికోతలు ప్రారంభమైన దృష్ట్యా వసతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. రైతులకు బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. మొక్కజొన్న తదితర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇందూరి సులోచన, ఎంఏ.చౌదరి, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు.