
దళితకాలనీల్లో కనిపించని అభివృద్ధి
రాయికల్: పట్టణంలోని దళితకాలనీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మూడో వార్డును బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22నెలలు పూర్తయినా దళితవార్డుల్లో నయాపైసా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ మారంపల్లి రాణి, రాయికల్ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయికుమార్, శ్రీరాముల సత్యనారాయణ, నాయకులు వినోద్, రాంప్రసాద్ పాల్గొన్నారు.