
విద్య, వైద్యానికి పెద్దపీట
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాలలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 62 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.15 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాలకు పల్లె దవాఖానాలు మంజూరు చేశామని, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. అధికార పార్టీతో ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం కొత్తకాదన్నారు. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్ రావు, నాయకులు సురేందర్‌రావు, ముకుందం, రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మహేశ్, గంగాధర్ పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేయండి
సారంగాపూర్: ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులుగా నియామకం అయినవారు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల పదవీకాలం మూడేళ్లు ఉంటుందని, ఆలయానికి కొత్త శోభ తీసుకొచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలంగూరి దామోదర్‌రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పాలకమండలి సభ్యులు చీర్నేని శ్రీనివాస్, యశోద రమేశ్, గుమ్మడి రమేశ్, పూడూరి గంగమణి, చల్లా లక్ష్మణ్, దేవనపెల్లి జగన్‌మోహన్, చెక్కపల్లి సత్తన్న, ఎనగంటి సతీశ్, చెట్టుపల్లి సత్యనారాయణ, చెన్న గంగాధర్, సామ్రాట్, భీమనాతి లవన్, అల్లెపు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.