
సనాతన ధర్మ రక్షణతోనే మానవాళికి మేలు
మల్యాల: సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వమానవాళికి మేలు చేకూరుతుందని, ఆలయాల రక్షణకు దత్తగిరి మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు తెలిపారు. అవదూతగిరి మహరాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురాతన ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించి, పూజించాలన్నారు. ఈవో శ్రీకాంత్‌రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఆలయ పర్యవేక్షకుడు సునీల్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో..
ధర్మపురి: అనంతరం పీఠాధిపతులు ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.