
అంతటా శివుడే
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో తాత్కాలికంగా భక్తులకు ఇబ్బందులు కలిగినా భవిష్యత్‌లో మంచి సౌకర్యాలు వస్తాయి. రాజన్న, భీమన్న, నగరన్న ఆలయాల్లో శివలింగాలు దర్శనమిస్తాయి. వేములవాడకు వచ్చిన భక్తులు ఎక్కడ దర్శించుకున్నా శివుడిని దర్శించుకున్నట్లే.
– నందిపేట సుదర్శన్‌యాదవ్,
రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త
మరింత ప్రాచూర్యం
ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం ఇప్పుడు అభివృద్ధికి భీజం పడింది. మొదటిదశగా రూ.150కోట్లతో పనులు చేస్తున్నారు. విస్తరణ పూర్తతే రాజన్న ఆలయ ప్రాశస్థ్యం మరింత పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
– సగ్గు పద్మ, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త
పీఠాధిపతుల సూచనలతో..
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులన్నీ శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకు చేపడుతున్నాం. భక్తుల మనోభావా లకు అనుగుణంగా, స్థానికులు, పురప్రముఖుల సూచనల మేరకు పనులు చేపడుతున్నాం. ఇంకా సలహాలు, సూచనలు ఎవరూ చేసినా స్వీకరిస్తాం. ఆలయ అభివృద్ధే మా ధ్యేయం. వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తాం.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్

అంతటా శివుడే

అంతటా శివుడే